Posts

భారతీయులకు కరోనా భయం అక్కర్లేదు- డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డి, వైరాలజిస్టు, అమెరికా

Image
  భారతీయులకు  కరోనా  భయం అక్కర్లేదు - ఈనాడు ప్రత్రిక నుంచి సేకరణ జాగ్రత్తలు పాటిస్తే చాలు మన జీవన విధానమే మనకు రక్ష అతి శుభ్రతే యూఎస్‌ఏ కొంప ముంచింది లాక్‌డౌన్‌తో అన్ని రంగాలకూ తీవ్ర నష్టం             అమెరికాలో వైరాలజిస్టు డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డి                 భారతీయుల్లో సహజంగా ఉండే యాంటీబాడీలు కరోనాను ఎదుర్కొంటాయని, అందుకే భయపడాల్సిన పనిలేదని ప్రవాసాంధ్రులు, వైరాలజిస్ట్‌, అమెరికాలో వ్యాపారవేత్త డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డి భరోసా ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ విషయంలో భారత్‌ వంటి దేశాలు చైనాను గుడ్డిగా అనుసరించడమూ తప్పిదమేనన్నారు. దీనివల్లనే ఆర్థిక వ్యవస్థలన్నీ బాగా దెబ్బ తిన్నాయని గుర్తుచేశారు. అమెరికాలో డా.ఎమ్‌.ఎస్‌.రెడ్డిగా ప్రసిద్ధి చెందిన డా.మలిరెడ్డి శ్రీనివాసులురెడ్డిది నెల్లూరు జిల్లా ఉప్పలపాడు. ఆయన భారత్‌ నుంచి అమెరికా వెళ్లిన తొలితరం వ్యక్తి. అక్కడ మైక్రోబయాలజీలో ఎమ్మెస్‌, వైరాలజీలో పీహెచ్‌డీ చేశారు. ఇంటర్నేషనల్‌ మీడియా అండ్‌ క్లస్టర్స్‌ అనే డెయిరీ ఉత్పత్తుల సంస్థను స్థాపించి, ఆ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద సం...